నదిపై విహారం లేకుండానే దుర్గమ్మ తెప్పోత్సవం..

విజయవాడ: దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నిన్నటి (విజయదశమి)తో ముగిశాయి. కానీ ఈ సంవత్సరం నదీ విహారం లేకుండానే తెప్పోత్సం సాగింది. అత్యంత కీలక ముగింపు ఘట్టమైన తెప్పోత్సవం ఈ సంవత్సరం కూడా సాంప్రదాయం ప్రకారం సాగింది. దసర ఉత్సవాలలో భాగంగా విజయవాడలో నిర్వహించే ఈ తెప్పోత్సవ విహారాన్ని చూసేందుకు వచ్చే జనంతో ప్రకాశం బ్యారేజీ కిక్కిరిసిపోతుంది. కానీ ప్రస్తుతం ఒక వైపు కరోనా వ్యాప్తి, మరోవైపు కృష్ణమ్మ వరద ఉధృతి నేపథ్యంలో.. తెప్పోత్సవ ఉత్సవమూర్తుల నదీ విహారాన్ని అధికారులు నిలిపేశారు. దుర్గాఘాట్‌లోని నది ఒడ్డు వద్దనే హంస వాహనంపై ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నదికి ఇచ్చిన హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి.