Nizamabad: ఎటిఎంలో రూ. 25 లక్షలు దోపిడీ

నిజామాబాద్ (CLiC2NEWS): ఎటిఎంలో ఉన్న సిసి కెమెరాలపై స్ప్రే చేసి ఏకంగా రూ. 25 లక్షలు కొల్లగొట్టారు దుండగులు. ఈ ఘటన నిజామాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్‌బిఐ ఎటిఎంలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి బొలెరో వాహనంలో నలుగురు దండగులు మాస్కులు ధరించి వచ్చారు. అక్కడున్న కెమెరాలలో రికార్డు కాకుండా స్ప్రే చేశారు. డబ్బులు తీసుకొని ఎటిఎం విడిభాగాలను బయట పడేసిపోయారు. పోలీసులు, క్లూస్ టీమ్ వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.