జులై 17 నుండి 31 వరకు డిఎస్‌సి పరీక్షలు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో డిఎస్‌సి పరీక్ష తేదీలు ఖరారైయ్యాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్‌సి పరీక్షలను జులై 17 నుండి 31 వరకు నిర్హహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు ఫిబ్రవరి 29 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. మరోవైపు డిఎస్‌సికి అర్హత సాధించే టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ కూడా విడుదలైంది.