మేం అధికారంలోకి వస్తే.. రూ. 4 వేలు పింఛన్: చంద్రబాబు
కుప్పం (CLiC2NEWS): వచ్చే ఐదే ళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం స్థాపించినప్పటి నుండి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని, ఇప్పటిదాకా మీరు నాపై ఏడు సార్లు అభిమానం చూపించారన్నారు. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత టిడిపి కూటమి ప్రభుత్వానిదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను నేనే అభివృద్ది చేశానని, ఆ తర్వాత దాని చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగడంతో రికార్డులు మార్చేసి పేదవాళ్ల భూములు లాక్కుంటాన్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేస్తున్నారన్నారు. మేం అధికారంలోకి వచ్చాక నియంత్రిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేంద్ర సాయం అవసరమని..ఈ ఎన్నికలలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు గెలవాలని చంద్రబాబు అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక రూ. 4వేల పింఛను ఇంటివద్దకే తెచ్చిస్తామన్నారు.