జనసేనాని ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు

మంగళగిరి (CLiC2NEWS): మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ రెండో తేదీ వరకు పవన్‌కల్యాణ్ పిఠాపురంలో ఉంటారని పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన గురువారం పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ప్రకటించారు. తొలి విడత ప్రచారంలో భాగంగా వవన్ కల్యాణ్ దాదాపు 10 నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు.
మార్చి 30 నుండి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలో నిర్వహించే బహిరంగ సభతో పాటు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. 3 న తెనాలి, 4 న నెల్లిమర్ల , 5 న అనకాపల్లి, 6 న యలమంచిలి, 7 న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 9వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. 10వ తేదీన రాజోలు, 11 న పి. గన్నవరం, 12 న రాజానగరం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొంటారు.