మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య .. ఇంట్లో చోరీ చేస్తున్న వైద్యుడు

ఏలూరు (CLiC2NEWS): మత్తు ఇంజక్షన్ ఇచ్చి .. ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం దోచుకుంటున్నాడు ఎంబిబిఎస్ చదివిన వైద్యుడు. ఈ ఘటన ఏలూరు శివారు చొదిమెళ్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చొదిమెళ్ల గ్రామంలో బత్తిన మల్లేశ్వరరావు విశ్రాంత ఉద్యోగి. మల్లేశ్వర రావుతో సన్నిహితంగా ఉండే కొవ్వూరి భానుసుందర్ అదే గ్రామానికి చెందినవాడు. అతను ఎంబిబిఎస్ చదివి నగరంలోని ఓ ప్రైవటు ఆసుపత్రిలో వైడ్యుడిగా పనిచేస్తున్నాడు. మల్లేశ్వరరావు ఒక్కడే ఉండటంతో ఆయనకు మత్తు ఇంజక్షన్ చేశాడు. అతను మత్తులోకి జారుకోగానే ఇంట్లోకి వెల్లి బంగారం, నగదు అపహరించుకుపోయాడు. మల్లేశ్వరరావు కోలుకోలేక చనిపోయాడు.
భానుసుందర్ ఈ తరహా చోరీలు గతంలో కూడా చాలా చేశాడు. అతనిపై ఏలూరు త్రీటౌన్ పరిధిలో కొంతమందికి వైద్యం చేసే నెపంతో వారకి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వారు మత్తులోకి జారుకోగానే ఇంట్లోకి చొరబడి దోచుకెళ్లేవాడు. వారు కొన్ని రోజులు అస్వస్థతకు గురై కోలుకునేవారు. కానీ మల్లేశ్వరరావు కోలుకోలేక మృతి చెందాడు. దీంతో భానుసుందర్‌పై అనుమానంతో నిలదీయగా అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.