పెబ్బేరు మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం..

వనపర్తి (CLiC2NEWS): జిల్లాలోని పెబ్బేరు మార్కెట్ యార్డు గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు వ్యాపించి 12.88 లక్షల గన్నీ సంచులు దగ్ధమైనట్లు సమాచారం. ఈ మంటలు పక్కనే ఉన్న ధాన్యం బస్తాలకు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఫైరింజన్లను ఉపయోగించి మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారలును అదేశించారు.