మత్తుకు బానిసై తండ్రిని హతమార్చిన తనయుడు

జగిత్యాల (CLiC2NEWS): జిల్లాలో కన్నతండ్రినే కడతేర్చాడు కొడుకు. మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీలో అభిరామ్ అనే వ్యక్తి గంజాయికి బానిసై కన్నతండ్రిని హత్య చేశాడు. కత్తితో మెడ కోసేయంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ ఐ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.