శ్రీశైలం వెళుతున్న వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు

సున్నిపెంట (CLiC2NEWS): ప్రకాశం 25 మంది భక్తులు శ్రీశైలం వెళుతుండగా.. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్ప బోల్తా పడింది. ఈ ప్రమాదం జిల్లాలోని చిన్నారుట్ల చెంచుగూడెం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రయాణికులంతా కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి రెండు వాహనాల్లో వెళుతున్నారు. వాటిలో ఒక వాహనం శ్రీశైలానికి 15 కిలో మీటర్ల దరూరంలో బోల్తాపడి ఈ ప్రమాదం జరిగింది.