సిసిఎస్ ఎసిపి నివాసంలో సోదాలు.. బయట పడుతున్న నోట్ల కట్టలు

హైదరాబాద్ (CLiC2NEWS): సిసిఎస్ ఎసిపి ఉమామహేశ్వరరావు ఇళ్లలో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎసిపిగా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న సిసిఎస్‌లో పలు కేసుల్లో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అశోక్ నగర్‌లో ఉన్న ఆయన నివాసం అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న మరో రెండు ఇళ్లలో , సిసిఎస్ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, ఎపిలోన రెండు చోట్లు సోదాలు కొనసాగుతున్ఆనయి. దాదాపు 12 గంటలుగా ఎనిమిది చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పలు కీలక డాక్యుమెంట్లతో పాటు రూ. 40 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు , స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.