జూన్ 2న ట్యాంక్‌బండ్‌పై కార్నివాల్: సిఎస్ శాంతికుమారి

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. అవతరణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్పార్ఖ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారని, ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కిరిస్తారని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు కళారూపా కార్నివాల్ జరుగుతుందని, అందులో బాణసంచా, లేజర్ షో ఉంటాయన్నారు. 5 వేల మంది శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారని ఆమె తెలిపారు.