Vemanapally: దొంగతనాలకు పాల్పడుతున్ననిందితుడు అరెస్టు

రామగుండం పోలీస్ కమీషనరేట్ (CLiC2NEWS): నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వేమనపల్లి మండలం కల్మల పేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతనివద్ద నుండి సుమారు 10 లక్షలకు పైగా విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మల్లంపేట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..
అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలోకూడా అతనిపై ఆస్తి అక్రమాలకు పాల్పడిన కేసులు ఉన్నాయి.