హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబయిన కొండగట్టు

కొండగట్టు (CLiC2NEWS): జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయం ఉత్సవాలకు ముస్తాబయింది. గురువారం నుండి శనివారం వరకు మూడు రోజులు ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా దీక్షాపరులు, భక్తులు కాలినడకన చేరుకుంటారు. ఈ సందర్భంగా సుమారు రెండు లక్షల మందికిపైగా దీక్షాపరులు తరలివచ్చి మాల విరమణ చేస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఇఒ తెలిఆపరు.
ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో భక్తుల దాహార్తి తీర్చేందుకు 28 చలివేంద్రాలు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాదం అందించడానికి కొండపైన బస్టాండు ప్రాంతంలో 14 కౌంటర్లను ఏర్పాటు చేయటం జరిగింది. కొండగట్టు పై, దిగువ, జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారి పక్కన పలు చోట్లు వైద్యా శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దాదాపు 650 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు అదికారులు తెలిపారు.