ఎపి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామాకృష్ణారెడ్డితో రాజీనామా చేశారు. ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ ఆర్‌సిపి పార్టి ఘోర పరాజయం చవిచూసింది. 175 స్థానాల్లో పోటిచేసిన ఆ పార్టి కేవలం 11 స్థానాల్లో గెలిచింది. దీంతో జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 20 మదికిపైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా సిఎస్ జవహర్‌రెడ్డికి లేఖలు పంపినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టిటిడి ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు.