ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణయుగం మొదలైంది: శివాజి

తిరుమల (CLiC2NEWS): ఎపికి స్వర్ణయుగం మొదలైందని సినీనటుడు శివాజి అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదే్‌లో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు , పవన్‌కల్యాణ్ నాయకత్వంలో ఎపి అభివృద్ధి చెందాలని శివాజి ఆకాంక్షించారు.