తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు.. సిఎస్ శాంతికుమారి

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రానున్న రెండేళ్లో 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్ధికంగా బోలపేతం చేయాలని , ఈ క్యాంటీన్లు నిర్వహణపై మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సిఎస్ సమీక్ష నిర్వహించారు. వీటి కోసం బెంగాల్లోని దీదీ కా రసోయ్, కేరళలోని క్యాంటీన్లపై అధ్యయనం చేసినట్లు సిఎస్ అన్నారు. ఈ క్యాంటీన్లు కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.