జూన్ 22 న జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం..

ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరగనుంది. వివిధ రకాల వస్తువులపై జిఎస్‌టి రేట్లు నిర్ణయించే ఈ సమావేశం ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో జరగనుంది. నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి సమావేశం. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి పూర్తికాల బడ్జెట్ సమర్పణకు ముందు ఈ భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొననున్నట్లు సమాచారం.