జలాశయంలో పడిన కుమార్తెను కాపాడబోయి తండ్రి మృత్యువాత

తిమ్మాపూర్ (CLiC2NEWS): జలాశయంలో పడిపోయిన కుమార్తెను కాపాడబోయిన తండ్రి నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి విజయ్ కుమార్ .. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అసిస్టెంట్ పే అండ్ అకౌంట్ (Works and Projects)లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. సోమవారం సెలవు రోజు కావడంతో కుటుంబంతో కలిసి హుస్నాబాద్‌లోని పొట్లపల్లి శివాలయానికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో అలుగునూర్ వద్ద ఎల్ ఎండిని చూద్దామని దిగువమానేరు జలాశయం పైకి వెళ్లారు. హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఆయన కుమార్తె జలాశయంలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు విజయ్‌కుమార్ జలాశయంలోకి దూకగా.. తండ్రిని చూసిన కుమారుడు 15 ఏళ్ల విక్రాంత్ సైతం నీటిలో దూకాడు.
పిల్లలిద్దరిని గట్టు వైపునకు నెట్టి న విజయకుమార్ నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న జాలరి వెంటనే స్పందించి పిల్లలిద్దరిని కాపాడారు. కాని విజయ్‌కుమార్ మాత్రం ప్రాణాలు కోల్పోయారు. పిల్లలను కాపాడిన జాలరిని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అభినందించారు.