ఖ‌మ్మంలో ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఖ‌మ్మం (CLiC2NEWS): అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ఖమ్మం పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్ర‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇవాళ ఉద‌యం ఉదయం 7 గంటలకు జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప‌ట్ట‌ణంలోని యోగ, ఆధ్యాత్మిక సంస్థల తరపున కన్వీనర్ వంజాకు లక్ష్మీనారాయణరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులు డాక్టర్ నరసింహారావు, డాక్టర్ కనక లక్ష్మీ, సిద్ధార్థ యోగ విద్యాలయం డాక్టర్ రామచంద్ర రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతదేశం యొక్క సనాతన ధర్మం, స్నేహ సోబ్రాతృత్వ సామరస్యం కొనియాడుతూ ఉద్యోగులు అందించిన ఈ యోగాను కేవలం ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఆచరించి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాలని సూచించారు. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామమే కాదు శరీరము మనసు బుద్ధి ఆత్మలతో అనుసంధానాన్ని సాధించాలని కోరారు. యోగం అంటే తనతో తాను మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి పక్షాదులు, జంతువులు, మరి ప్రతి జీవరాశితోను స్నేహ సౌభ్రాతృత్వాల‌ను పెంపొందించుకొని ఆర్కిటిక నుంచి అంటార్కిటిక్ వరకు ఏకత్వాన్ని సాధించి కుటుంబంగా జీవించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి పలు సంస్థలు జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి సునీల్ రెడ్డి, పిరమిడ్ సొసైటీ నుండి కాసిన ఆనంద్ ప్రసాద్, కే శైలజ, Rim for sslym బాలరాజ్, బ్రహ్మకుమారిస్ రాజయోగ, పీస్ యోగ వెల్నెస్ షేక్ బహార్ అలీ, రామచంద్ర మిషన్ నరసింహా చారి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోటేశ్వరరావు , శ్రీ సత్యసాయి ధ్యాన మండలి చంద్రశేఖర్, స్వరూప, వర్తకసంఘం పతంజలి యోగ శర్మ, నాగేశ్వరావు, సిద్ధి సమాధి యోగ (ssy) పద్మ పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో చాంబర్ ఆఫ్ కామర్స్ చిన్ని కృష్ణారావు, రెడ్ క్రాస్ సొసైటీ,నెహ్రూ యువ కేంద్రం వారు స‌హ‌క‌రించార‌ని నిర్వ‌హ‌కులు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మర్రికంటి వెంకట పిచ్చయ్య రచించిన నవ్వుమా గద్య రచనపుస్తకావిష్క‌ర చేశారు. కార్య‌క్ర‌మం చివ‌ర‌న యోగ కేంద్ర నిర్వాహకులకు, యోగ గురువులకు ఘ‌నంగా సన్మానించారు.

 

Leave A Reply

Your email address will not be published.