ఖ‌మ్మంలోని క్రియేటివ్ హైస్కూల్ లో యోగా దినోత్స‌వం

ఖ‌మ్మం (CLiC2NEWS): 10 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సంద‌ర్బంగా ఖమ్మం లోని క్రియేటివ్ హై స్కూల్  నందు శ్రద్ధ శ్రీ యోగాచార్యులు షేక్ బహారలి  యోగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మ‌ము  నిర్వహించారు. పాఠ‌శాల‌లోని విద్యార్థిని విద్యార్థులు మరియు గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి యోగా దినోత్స‌వం గురించి తెలిపి.. యోగాసనాలు మరియు ప్రాణాయామము, ధ్యానం నందు శిక్షణ ఇచ్చారు.   విద్యార్థిని, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా యోగాసనాలు చేయడం జరిగినది. శా రీరకంగా మానసికంగా, ఆరోగ్యపరంగా ఉండేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని,  ప్రతిరోజు మనము యోగ నీ ఒక భాగం చేసుకోవాల్సిన అవసరముంద‌ని విద్యార్థుల‌కు చెప్ప‌టం జ‌రిగింది.

యునైటెడ్ నేష‌న్స్‌ జనరల్ అసెంబ్లీ 69  సమావేశంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ప్రతిపాదనకు స్పందనగా ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 11, 2014 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేసింది. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 న 2015 జరుపుకున్నాము. ఉత్తరార్థ గోళంలో సంవత్సరంలో అత్యంత పొడవైన రోజు కాంతి మరియు ఆరోగ్యానికి చిహ్నంగా ఉండే వేసవి కాలంతో పాటు రోజు తేదీని రూపొందించినారు. కనుక ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ వ‌స్తుంది.

Leave A Reply

Your email address will not be published.