సైబ‌ర్ నేర‌గాళ్ల న‌యా మోసాలు

డ‌బ్బు ఆశ చూపి.. అద్దెకు బ్యాంకు ఖాతాలు

ప‌నాజి (CLiC2NEWS): సైబ‌ర్ నేర‌గాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త త‌ర‌హాలో మోసాలు చేసి డ‌బ్బులు కాజేస్తున్నారు. ఇపుడు తాజాగా బ్యాంకు ఖాతాల‌ను అద్దెకు తీసుకుని వాటితో లావాదేవీలు సాగిస్తున్నారు. చిన్న చిన్న ప‌నులు చేసుకునే వారికి, యువ‌త‌కి డ‌బ్బు ఆశ చూపి.. వారి బ్యాంకు ఖాతాల‌ను అద్దెకు తీసుకుంటున్నారు. ప్ర‌తి రూ. ల‌క్ష కు రూ. 1000 చొప్పున అద్దె చెల్లిస్తామ‌ని, ఆ ఖాతాకు సంబంధించిన అన్ని ప‌త్రాలు , చెక్‌బుక్‌తో స‌హా సైబ‌ర్‌నేర‌గాళ్లు తీసుకుంటున్నారు. వారితోనే డబ్బులు విత్‌డ్రా కూడా చేయిస్తున్న‌ట్లు స‌మాచారం.

గోవా పోలీసులు చేప‌ట్టిన ద‌ర్యాప్తులో యువ‌త ఎక్కువ‌గా త‌మ ఖాతాల‌ను నేర‌గాళ్ల‌కు అద్దెకు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కామ‌న్ ప్రెండ్స్ ఇలాంటి యువ‌త‌ను ప‌రిచ‌యం చేసుకుని బ్యాంకు ఖాతాల‌ను అద్దెకిస్తే డ‌బ్బులిస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తున్నారు. వారి ఖాతాల‌లో జ‌మయ్యే డ‌బ్బు ఎక్క‌డినుండి వ‌స్తుందో .. ఎవ‌రు పంపుతున్నార‌న్న విష‌యాలేవీ వారికి తెలియ‌దు. కేవ‌లం నేర‌గాళ్లు ఇచ్చే అద్దె డ‌బ్బుల కోసమే వారు ఈ ప‌నికి అంగీక‌రిస్తున్నట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.