Kamareddy: గిర‌జ‌న సంక్షేమ మిని గురుకులంలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

కామారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని మాచారెడ్డి, నాచుప‌ల్లి గిర‌జ‌న సంక్షేమ మిని గురుకులంలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. ఒక‌ట‌వ త‌ర‌గతిలో 30 సీట్లు, 2వ త‌ర‌గ‌తి నుండి 5 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మిగిలిన ఖాళీ సీట్ల‌కు ఎస్‌టి విద్యార్థిలు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ జులై 2. ఆస‌క్తి గ‌ల ఎస్‌టి బాలిక‌లు సంబంధిత పాఠ‌శాల‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించాల‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

మాచారెడ్డి, నాచుప‌ల్లి మండ‌లాల‌కు చెందిన విద్యార్థినుల‌కు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. సీట్లు మిగిలిఉంటే మిగ‌తా మండ‌లాల వారికి అవ‌కాశం ఉంటుంది. విద్యార్థులు ఒక‌ట‌వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌సు పూర్తి చేసుకున్న బాలికలు అర్హులు. లాట‌రీ ప‌ద్ద‌తి ద్వారా ఎంపిక ఉంటుంది. జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ స‌మ‌క్షంలో జులై 5న లాట‌రీ ద్వారా విద్యార్థినుల‌ను ఎంపిక చేస్తారు.

Leave A Reply

Your email address will not be published.