ఎపి రాజ‌ధాని నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళం..ఈనాడు ఎండి కిరణ్‌

విజ‌య‌వాడ‌ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించారు ఈనాడు ఎండి కిరణ్‌. ప్ర‌జా  శ్రేయ‌స్సుకోసం, ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం జీవితాంతం పిర‌త‌పించిన వ్య‌క్తి రామోజీరావ‌ని.. ప్ర‌జ‌ల హ‌క్కుల‌నుపాల‌కులు క‌బ‌ళించిన‌పుడ‌ల్లా ఆయ‌న బాధితుల ప‌క్షం వ‌హించేవారిన కిర‌ణ్ అన్నారు. గురువారం ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం ఏర్పాటుచేసిన రామోజీరావు సంస్మ‌ర‌ణ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..

ఆయ‌న న‌మ్మిన విలువ‌ల‌ను త్రిక‌ర‌ణ శుద్ధిగా కొన‌సాగిస్తామ‌ని మాకుటంఉబ స‌భ్యులు, నా త‌ర‌పున స‌భా ముఖంగా మాటిస్తున్నామ‌న్నారు. ఎపి రాజ‌ధాని నిర్మాణం కోసం రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి దేశంలోనే గొప్ప న‌గ‌రంగా మారాల‌న్నారు. సంస్మ‌ర‌ణ స‌భ నిర్వ‌హించిన ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.