సీజ‌న‌ల్ వ్యాధుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి: మంత్రి నారాయ‌ణ‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): రాష్ట్రవ్యాప్తంగా సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ‌తో పాటు మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు ఆర్ధికంగా బ‌లోపేతం చేసేందుకు టిడిపి ప్ర‌భుత్వం క్షేత్ర‌స్థాయినుండి కృషి చేస్తుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది మంత్రి నారాయణ తెలిపారు. ఆయ‌న శుక్ర‌వారం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల క‌మిష‌న‌ర్ల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ‌కు తీసుకుంటుంనున్న చ‌ర్య‌ల‌ను , త్రాగునీటి స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచేందుకు చేప‌డుఉత‌న్న ప‌నుల‌ను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు క‌లుషితం కావ‌డం వ‌ల‌న డ‌యోరియో ప్ర‌బ‌లే అవ‌కాశం ఉన్నందున త‌గు జాగ్ర‌త్తలు పాటించాల‌ని సూచించారు.

ఈ స‌మావేశంలో రాష్ట్ర పురపాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాక ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ , సిడిఎంఎ శ్రీ‌ధ‌ర్, టైన్ ప్లానింగ్ డైరెక్ట‌ర్ విద్యుల్ల‌త , ప‌బ్లిక్ హెల్త్ ఇంజ‌నీరింగ్ ఇన్ చీఫ్ ఆనంద‌రావు.. 17 మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల క‌మిష‌న‌ర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.