తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన కెఎస్ శ్రీనివాసరాజు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కెఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరాజు రాష్ట్ర మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఐఎఎస్‌లు, ఐపిఎస్‌ల బదిలీలు జరుగుతున్నవి. తాజాగా ఎనిమిది మంది ఐపిఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది.