AP: ఎర్రచందనం స్మగ్లింగ్ పై దృష్టి సారించిన డిప్యూటి సిఎం

అమరావతి (CLiC2NEWS): కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ రూ. 1 కోటి విలువ చేసే 158 ఎర్ర చందనం దుంగలు దొరికాయని అధికారులు డిప్యూటి సిఎం దృష్టికి తెచ్చారు. దీంతో ఎర్రచందన అక్రమ రవాణా నివారణకు నిఘా వ్యవస్తను పటిష్టం చేయాలని డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు. దీని వెనుక ఉండి నడిపిస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని శేషాచలం అడవుల్లో నరికిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో కూడా గుర్తించాలని డిప్యూటి సిఎం అధికారులను ఆదేశించారు.