జులై 11 నుండి రైతుబజార్లలో కందిపప్పు, బియ్యం విక్రయం.. నాదెండ్ల మనోహర్
అమరావతి (CLiC2NEWS): ఎపిలో బియ్యం, కందిపప్పు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాపారులను ఆదేశించారు. ఈ నెల 11 నుండి రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం విక్రయాలు జరగాలని మంత్రి నిర్ణయించారు. బియ్యం , కందిపప్పు వ్యాపారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ వంటి చర్యలకు పాల్పడవద్దని వ్యపారులకు సూచించారు. ప్రస్తుతం బయట మార్కెట్లలో కిలో కందిపప్పుధర రూ. 180 ఉండగా.. రైతు బజార్లలో రూ. 160 గా నిర్ణయించారు. అదేవిధంగా స్టీమ్డ్రైస్ కిలో ధర రూ. 55.85 ఉండగా.. రైతుబజార్లలో రూ. 49 కే అందనుంది. ముడి బియ్యం బయట మార్కెట్లలో రూ. 52.40 ఉండగా.. రైతు బజార్లో రూ. 48కే అందుతుంది.