ఒయులో జర్నలిస్టు అరెస్టుపై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్ (CLiC2NEWS): ఉస్మానియా యూనివర్సిటీలో న్యూస్ కవరేజ్‌కి వచ్చిన జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేయడంపై బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటి మెయిన్ లైబ్రరీ వద్ద డిఎస్‌సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. అక్కడకు వెళ్లిన జి న్యూస్ రిపోర్టర్ చొక్కాపట్టుకొని లాక్కెళ్లారు. నేను జర్నలిస్ట్‌ని అని చెప్పినా పట్టించుకోకుండా అరెస్టు చేశారు. ఈ ఘటనసై కెటిఆర్ స్పందించారు. న్యూస్ రిపోర్టర్, కెమెరామెన్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. అదే విధంగా నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఓ మహిళా జర్నలిస్టుతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని గుర్తుచేశారు.