గిరిజన కుటుంబానికి కెటిఆర్ రూ.5 లక్షల ఆర్ధిక సాయం

చెన్నారావుపేట (CLiC2NEWS): ఇటీవల ప్రేమోన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలకి బిఆర్ ఎస్ తరపున కెటిఆర్ రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందజేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారుచింతల తండాకు చెందిన దీపిక తల్లిదండ్రులు అతని ప్రియుని చేతిలో హత్యకు గురయిన విషయం తెలిసిందే. వారితోపాటు దీపికి, ఆమె సోదరుడు కూడా గాయపడ్డాడు. వీరిద్దరిని నర్సంపేట మాజి ఎమ్మెల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి కెటిఆర్ వద్దకు తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్దికసాయంతోపాటు వారి చదువు బాధ్యత తనదేనని కెటిఆర్ హామీ ఇచ్చారు.
దీపిక, బన్నీ గతేడాది నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరిలో యువతి తల్లదండ్ఉలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి .. యువతిని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించారు. అప్పటి నుండి యువతి ఇంటివద్దనే ఉంటూ డిగ్రీ చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో ఉన్నదిగా మారిన బన్నీ.. జులై 11న ఇంటి ముందు నిద్రిస్తున్న యువతి తల్లదండ్రులపై దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణలు మృతి చెందారు. ఈ దాడిలో దీపికకు. ఆమె సోదరుడుకు కూడా గాయాలయ్యాయి. వారు దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇచ్చేలా రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.