BSNL: మనకు నచ్చిన నెంబర్ సులువుగా పొందొచ్చు.. !

BSNL: ఆన్‌లైన్‌లో మనకు నచ్చిన నెంబర్‌కు సులువుగా మారే అవకాశం కల్పిస్తుంది బిఎస్ఎన్ఎల్. ఇటీవల జియో, ఎయిర్‌టెల్, ఒడాఫోన్ ఛార్జీలు పెరగడంతో వినియోగదారులు ప్రభుత్వరంగ టెలికాం కంపెని అయిన బిఎస్ఎన్ఎల్‌కు మారుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ తక్కువ ధరకు ప్లాన్లు అందించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. బిఎస్ఎన్ఎల్‌లో 4జి నెట్‌వర్క్ సేవలు మరింత విస్తృతం చేస్తున్నట్లు సమాచారం. తమ నెట్‌వర్క్ కు మారాలనుకునేవారికి ఆన్‌లైన్‌లో సులువుగా నచ్చిన నెంబర్‌ను ఎంపిక చేసుకునే సదుసాయం కల్పిస్తోంది.