గోడ కూలి చిన్నారుల మృతి ఘటన.. శబ్ధ కాలుష్యం వలనే గోడ కూలిందా?
బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం
భోపాల్ (CLiC2NEWS): మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి చెందారు. ఓ మతపరమైన కార్యక్రమంలో డిజె బాక్సులు వినియోగించడం వలనే గోడకూలినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు శిథిలావస్థకు చేరిన గోడ శబ్ధప్రకంపనాల వల్ల కూలి పోయిందని , దాని పక్కనే ఆడుకుంటున్న చిన్నారులపై పడిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులు మృతి చెందారు. వీరంతా 10 నుండి 15 ఏళ్ల లోపు వారే. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. చిన్నారుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. బాధత కుటుంబాలకు రూ.4 లక్షలు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, ఎస్‌పి, రేహిల్ ఎస్‌డిఎంలను బాధ్యతల నుండి తొలగించాలని ఆదేశించారు. అంతేకాక పరిమితికి మించి సౌండ్ బాక్సులను ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.