ఎపిలో త్వ‌ర‌లో కొత్త రేష‌న్ కార్డులు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): వివాహ న‌మోదు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఆధారంగా కొత్త రేష‌న్ కార్డులు జారీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఎపిలో 1.45 కోట్ల రేష‌న్ కార్డులు ఉన్నాయి. ఇందులో 89 ల‌క్ష‌ల రేష‌న్ కార్డుల‌కు ఆహార‌భ‌ద్ర‌త చ‌ట్టం కింద కేంద్ర నిత్యావ‌స‌రాలు అందిస్తోంది. మిగిలిన కార్డుల‌కు రేష‌న్ ఖ‌ర్చు రాష్ట్రం భ‌రిస్తుంది. పెళ్లైన వారికి కొత్తగా రేష‌న్ కార్డులు కావాలంటే వివాహ న‌మెదు ప‌త్రం ఆధారంగా కొత్త జంట‌కు రేష‌న్ కార్డు జారీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 2019-24 మ‌ధ్య గ‌త ప్ర‌భుత్వం రేష‌న్ కార్డుల‌న్నిటిపై జ‌గ‌న్ బొమ్మతో పాటు వైఎస్ ఆర్ సిపి రంగుల‌తో ముద్రించింది. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.