శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. కోటి విలువచేసే బంగారం స్వాధీనం

హైదరాబాద్ (CLiC2NEWS): దుబాయ్ నుండి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్నిశంషాబాద్ విమానాశ్రయంలో డిఆర్ ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి నగరానికి వస్తున్న యువకుడి వద్ద ఉన్న బ్యాగులు తనిఖీ చేయగా.. సురమారు రూ. కోటి విలువైన 1,390 గ్రాముల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బూట్ల కింద, బ్యాక్ ప్యాక్ వెనుక బంగారం దాచినట్లు సమాచారం. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.