ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

విజయవాడ (CLiC2NEWS): శ్రావణమాసం సందర్బంగా ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఈ రోజు 3వ శ్రావణ శుక్రవారం సందర్బంగా అమ్మవారి సన్నిధానంలో నిర్వహించిన కార్యక్రమంలో 500 మందికి పైగా మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఈ వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని దేవస్థానం అధికారులే ఉచితంగా అందజేశారు. మరోవైపు కుంకుమార్చన సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శ్రావణమాసం అందునా శుక్రవారం కావడంతో ఉదయం నుండే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.