ఎపి సిఎం చంద్రబాబును కలిసిన బాబూమోహన్

హైదరాబాద్ (CLiC2NEWS): మాజి మంత్రి బాబూమోహన్ ఆదివారం ఎపి సిఎం చంద్రబాబును కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముందు బిజెపి లో ఉన్న ఆయన పార్టికి రాజీనామా చేశారు. అనంతరం ప్రజాశాంతి పార్టీలో చేరారు. కానీ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. తాజాగా ఆదివారం ఎన్టిఆర్ భవన్లో చంద్రబాబును బాబుమోహన్ కలవడంతో టిడిపిలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.