నూజివీడు ట్రిపుల్ ఐటిలో 500పైగా విద్యార్థులకు అస్వస్థత!

నూజివీడు (CLiC2NEWS): ఏలూరు జిల్లాలోని నూజివీడే ట్రిపుల్ ఐటి కళాశాలలో మంగళవారం ఒక్కరోజులో 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. విద్యార్థుల వాంతు, విరోచనాలు, జ్వరం, కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గడిచన మూడు రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మూడు రోజులనుండి విద్యార్థులవిద్యార్థులు అనారోగ్యానికి గురవుతుంటే మందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని .. యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై కమిటి వేసినట్లు ట్రిపిల్ ఐటి పరిపాలనాధికారి తెలిపినట్లు సమాచారం.