సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ.. జనసేన

పిఠాపురం (CLiC2NEWS): శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్బంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో అధిక సంఖ్యలో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. పూజలో పాల్గొన్న ఆడపడుచులకు ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ చీరలు, పూజా సామాగ్రి ఉచితంగా సమకూర్చారు. వాటిని పూజలో పాల్గొన్న మహిళలకు జనసేన పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ అందజేశారు. అనంతరం వరలక్ష్మీ వ్రతం ఆచరించారు.