హైడ్రా: రాంనగర్లో ఆక్రమ నిర్మాణాల కూల్చివేతలు

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని అడిక్మెట్ డివిజెన్ రాంనగర్ లో శుక్రవారం హైడ్రా కూల్చి వేతలు ప్రారంభించింది. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన అనంతరం నివేదిక సమర్పించాలని జిహెచ్ ఎంసి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమేనని నిర్ధారణ కాగా.. అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే హైడ్రా చర్యలు తీసుకోవడంపై స్థానికులు షర్షం వ్యక్తం చేస్తున్నారు.