రేపటి నుండి ముంపు ప్రాంతాల్లో నిత్యావసరాలు సరఫరా..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి ముంపు ప్రాంతాల్లో నిత్యావసారల సరుకులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో వరదలు కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో ఇంకా నీరు ఉండటంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. వారికి డ్రోన్లద్వారా ఆహార సరఫరా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. గురువారం నుండి సబ్సిడీ ధరతో కూరగాయల విక్రయాలు ప్రారంభమయ్యాయని.. రేపటి నుండి నిత్యావసరాల సరుకులు పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇ-పోస్ మిషన్ ద్వారా సరకులు పంపిణీ జరగనుంది.