సెల్ఫ్ క్వారంటైన్ లోకి డబ్ల్యుహెచ్ఓ చీఫ్

జెనీవా: ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అథ‌నామ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాజాగా కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిస వ్య‌క్తిని ఇటీవ‌ల తాను క‌లిసిన‌ట్లు స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. అయితే, తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని, డబ్ల్యుహెచ్ఓ మార్గదర్శకాలకు అనుసరించి తాను కొన్నిరోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండనున్నట్లు సోమవారం టెడ్రోస్ ట్వీట్ చేశారు. ఇంటి నుంచే తన విధులను నిర్వర్తించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన మార్గదర్శకాలను మనమంతా విధిగా పాటించాలని, తద్వారా మాత్రమే కరోనా వ్యాప్తికి సంబంధించిన లింక్ ను ఛేదించగలుగుతామని టెడ్రోస్ అన్నారు.
కొవిడ్‌-19 క‌ట్ట‌డి టెడ్రోస్ నేతృత్వంలో డ‌బ్ల్యూహెచ్‌వో విశేష కృషి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటు మ‌హ‌మ్మారి క‌ట్ట‌డితో పాటు వ్యాక్సిన్ అభివృద్ధిపై వివిధ దేశాల మ‌ధ్య సంబంధాల్సి స‌మ‌న్వ‌య‌ప‌రుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.