రాఘవాపూర్ ప్రాంతం శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

రామగుండం కమిషనరేట్ (CLiC2NEWS): పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవ పూర్ శివారు ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ రహస్యంగా పేకాట ఆడుతున్న కుమ్మరి సుదర్శన్, కీసారపు శ్రావణ్, చాగంటి అశోక్, సాగర్ల నరేష్, కొమ్ము రాజు , టి. అనిల్ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ. 5,030 రూపాయల నగదు, 6 మొబైల్లుస్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వాటిని తదుపరి విచారణ నిమిత్తం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.