లోక్ అదాలత్ లో 6903 కేసుల పరిష్కారం

రామగుండం (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు, సూచనల ప్రకారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు ..రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి సెప్టెంబరు 28వ తేదీన జాతీయ మెగా లోక్‌ అదాలత్ నిర్వ‌హించారు. రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి 15 రోజుల నుండి కేసులలో ఉన్న నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి.. రామగుండం కమిషనరేట్ పరిధిలో 6903 కేసులు పరిష్కరించారు.

జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 61 సైబర్ క్రైమ్ కేసులలో మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 5 కేసులలో కలిపి మొత్తం 66 కేసులలో 17,01,816 నగదు బాధితులకు ఇప్పించేందుకు గౌరవ కోర్ట్ ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగింది అని సీపీ గారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.