ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ (CLiC2NEWS): భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కవిత హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆమె దవాఖానాలో చేరినట్లు బిఆర్ ఎస్ వర్గాలు తెలిపాయి. తిహార్ జైలు లో ఉన్న సమయంలో కవితకు గైనిక్ సమస్యలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమె చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో మరో సారి నేడు కవిత ఆసుపత్రిలో చేరారు. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నాయి.