మహాచండీ దేవి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ

విజయవాడ (CLiC2NEWS): శరన్నవరాత్రులు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనదుర్గ అమ్మవారు మహాచండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారని.. కోరిన కోరికలు సత్వరమే లభిస్తాయని భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు.