ఎపి డిప్యూటి సిఎంను కలిసిన నటుడు షాయాజి షిండే

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని సినీ నటుడు షాయజి షిండే కలిశారు. దేవాలయాల్లో ప్రసాదంతో పాటు ఓ మెక్కను కూడా భక్తులకు ఇవ్వాలనే తన ఆలోచనను పవన్ కల్యాణ్‌కు తెలిపారు. తాను మహారాష్ట్రలో వృక్ష ప్రసాద్ యోజన అనే పేరుతో మూడు ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నట్లు షిండే తెలిపారు. షిండే ఆలోచనను పవన్‌కల్యాణ్ స్వాగతించారు. సిఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు.
‘మానాన్న సూపర్ హీరో’ మూవి ప్రచారంలో భాగంగా ఇటీవల షాయాజి షిండే ‘బిగ్ బాస్ సీజన్-8’లో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లో ప్రసాదంతో పాటు మెక్కను కూడా ఇవ్వాలని తన ఆలోచన వ్యక్తం చేశారు. ఎపి డిప్యూటి సిఎం అపాయింట్‌మెంట్ దొరికితే ఆయనకు తన ఆలోచనలు తెలియపరుస్తానన్నారు.
[…] […]