యాక్షన్ కింగ్ డైరెక్షన్లో నాగచైతన్య?

యాక్షన్ కింగ్ అర్జున్ కి హీరోగా ఎంత మంచి పేరుందో దర్శకుడిగా కూడా అంతే మంచి పేరుతో పాటు మంచి హిట్లు కూడా వున్నాయి. గత కొంత కాలంగా డైరెక్షన్‌కి దూరంగా వున్న యాక్షన్ కింగ్ అర్జున్ త్వరలో మళ్లీ డైరెక్షన్ చేయబోతున్నారు. త్వరలో ఆయన తెలుగు సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా తెలుగులో అక్కినేని వారసుడు నాగ చైతన్యను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల చైతూని కలసి, ఆయన కథ చెప్పారనీ, అది చైతూకి బాగా నచ్చిందని అంటున్నారు. దాంతో ప్రాజక్టుకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి సంబంధించి త్వరలో అఫీషియల్ ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్వకత్వంలో సాయి పల్లవి జంటగా చైతూ ఓ లవ్ స్టోరీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో వచ్చే ఏడాది దీన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరో వైపు.. విక్రమ్ కుమార్ డైరెక్షన్ వస్తున్న థ్యాంక్యూ సినిమాలో నటించేందుకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఈ మూవీ అఫీషియల్‌గా లాంచ్ అయింది. త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో చైతో యాక్షన్ కింగ్ అర్జున్ చేయాలనుకుంటున్న మూవీ కోసం చాలా టైమ్ పట్టేలా వుంది. అందుకు అర్జున్ రెడీగానే వున్నారట. ఈ మూవీ ద్వారా తన కూతురు ఐశ్వర్యని హీరోయిన్గా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాట.