తొలిరోజు పాఠ‌శాల‌ల్లో 80% హాజరు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ‌శాల‌లు నేడు పునఃప్రారంభం అయిన విష‌యం తెలిసిందే. తొలి రోజు 80 శాతం విద్యార్తులు హాజ‌రైన‌ట్లు ఎపి విద్యా మంత్రి ఆదిమూలపు సరేష్‌ పేర్కొన్నారు. మంత్రి సోమ‌వారం మీడియాతో మాట్ల‌డుతూ.. మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు ఉన్నట్లు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నామ‌న్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు 70 శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని అదేశించామ‌ని తెలిపారు. దాదాపు అయిదారు నెలలు స్కూల్స్ న‌డ‌వ‌క‌పోవ‌డంతో పూర్తి ఫీజు ఎలా వసూలు చేస్తారని మంత్రి ప్ర‌శ్నించారు. యాజ‌మాన్యాల‌కు.. టీచర్లు, సిబ్బంది జీతాలు ఉంటాయి కాబట్టి అన్ని ఆలోచించి 70 శాతం ఫీజు నిర్ణయించామ‌ని తెలిపారు. ఏ ఒక్కరూ అంతకు మించి వసూలు చేయవద్ద‌ని ఆదేశించారు. ఎవ‌రైనా 70శాతం మించి వ‌సూలు చేసిన‌ట్లు పిర్యాదు వస్తే క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి హెచ్చ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.