ఎపిలో భారీ వ‌ర్షాలు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కారణంగా ఎపిలోని ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం ఉద‌యం నుండి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. నెల్లూరు, ప్ర‌కాశం, బాప‌ట్ల, అన్న‌మ‌య్య‌ జిల్లాల్లో విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

అన్న‌మ‌య్య జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వ‌ర్షాలు కార‌ణంగా విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌కటించారు. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు, మ‌ద్దిపాడు, గిద్ద‌లూరు, కొమ‌రోలు, బాప‌ట్ల , చీరాల వేట‌పాలెం, చిన‌గంజాం, కారంచేడు ఇంకొల్లు, కొల్లూరు, ప‌ర్చురు, మార్టూరు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. కృష్ణా జిల్ఆ మ‌చిలీప‌ట్నం, ఉయ్యూరు, అవ‌నిగ‌డ్డ‌లో ఈదురుగాలుల‌లతో వ‌ర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లాలోని ఇందుకూరిపేట‌, కొడ‌వ‌లూరు, కోవూరు మండ‌లాల్లో వ‌ర్షం ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోంది. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.