ఉగ్రదాడి… 25 మంది మృతి

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కాబుల్‌లోని ఓ యూనివర్సిటీలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో 25 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, భద్రతా దళాలు ప్రతి దాడి చేసి దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులనూ మట్టు బెట్టారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వర్సిటీ క్యాంపస్‌లో ఇరానియన్ బుక్‌ఫెయిర్ ప్రారంభ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఆపరేషన్ ఆరు గంటల పాటు కొనసాగిందని ఆఫ్ఘన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది. అయితే ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే విషయం తెలియలేదని, దీనిపై ఏ ఉగ్రవాద సంస్థ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని స్థానిక వర్గాలు వెల్లడించాయి.
అయితే కాబుల్‌లోని కొన్ని విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడుతోంది. గత వారంలో కాబుల్‌లోని ఓ విద్యా సంస్థ వద్ద ఐసిస్ ఆత్మాహుతి డాడికి పాల్పడగా 24 మంది కోల్పోయారు.