బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. నాలుగు రాష్ట్రాలు అప్రమత్తం

విశాఖ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిని అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా బలపడింది. బుధవారం ఉదయానికి తుఫాను గా, గురువారం తెల్లవారుజామున తీవ్ర తుఫాను (దానా)గా రూపాంతం చెందనుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. దీంతో ఎపి, ఒడిశా, పశ్చిమ బెంగాల్ , తమిళనాడు రాష్ట్రాలను ఐఎండి అప్రమత్తం చేసింది. గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం ఉదయంలోపు పూరీ, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటొచ్చని భావిస్తోంది. ఈ దానా తుఫాను కారణంగా ఎపిలోని విజయనగరం, పర్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.